NTV Telugu Site icon

National Doctors Day 2024: మానసిక ఆరోగ్యం, సామాజిక సవాళ్లతో పోరాడుతున్న డాక్టర్లు

New Project (38)

New Project (38)

National Doctors Day 2024: వైద్యం ఒక ఉన్నతమైన వృత్తి.. సమాజంలో వైద్యులకు దేవునితో సమాన హోదా ఇస్తారు. వైద్యులను మన సమాజంలో సూపర్ హీరోలు అని కూడా పిలుస్తారు, కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య సంక్షోభం సమయంలో వైద్యులు సమాజానికి రక్షణ కవచంగా నిలిచారు. అతి క్లిష్ట రోగాలలో రక్షకులుగా మారే వైద్యులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న అవసరం ఎందుకంటే సాధారణంగా మన సమస్యలకు మించి ఏమీ కనిపించదు. వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారా.. వారు ఏ పరిస్థితులలో మనకు చికిత్స చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదపడటంలో అపూర్వమైన పాత్రను పోషించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. వారి అంకితభావం, నిస్వార్థ సేవ కోసం వారిని గౌరవించటానికి ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం 2024ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో మన వైద్యులు మనకు ఏ పరిస్థితుల్లో చికిత్స చేస్తున్నారో తెలుసుకుందాం.

వైద్యులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేయడం, వారి అవిశ్రాంత ప్రయత్నాలను అభినందించడం, మెరుగైన వనరులు, అనుకూలమైన పని పరిస్థితులను వారికి కల్పించడం ముఖ్యం. భారతదేశంలో ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించడంలో దృఢమైన దూరదృష్టి గల నాయకులు ఉన్నారు. వారి మార్గదర్శక ప్రయత్నాలు దేశవ్యాప్తంగా వైద్యం పరిధిని విస్తృతం చేశాయి. అయితే వీటన్నింటి నడుమ వైద్యులపై తరుచూ జరుగుతున్న దాడులు, దురుసుగా ప్రవర్తించే ఘటనలను అరికట్టడంతోపాటు వారి వ్యక్తిగత జీవితాలకు చోటు కల్పించి వైద్యుల శారీరక, మానసిక ఆరోగ్యంపై సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also:Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. నా జీతం కూడా వదిలేస్తున్నా..

మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వైద్యులు
2023లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్వహించిన సర్వేలో దాడులు, క్రిమినల్ కేసుల భయం, నిద్రలేమి, ఒత్తిడి, సామాజిక వాతావరణం, సంప్రదాయవాదం వంటి కారణాల వల్ల దేశంలోని వైద్యులలో ఎక్కువ మంది మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. సర్వే నివేదిక ప్రకారం, దేశంలోని 82.7శాతం మంది వైద్యులు తమ వృత్తిలో ఒత్తిడికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 1,681 మంది వైద్యులపై నిర్వహించిన ఈ సర్వేలో 46.3శాతం మంది వైద్యులు ఒత్తిడికి హింస భయమే ప్రధాన కారణమని, 13.7శాతం మంది క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు భయపడుతున్నారని చెప్పారు. ప్రతి రాత్రి 6-8 గంటలు నిద్రపోవాలని రోగులకు సలహా ఇచ్చే వైద్యులు వివిధ కారణాల వల్ల తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది సరైన భోజనం కూడా తీసుకోలేకపోతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు.

డాక్టర్ దేవుడు కాదు
సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సత్యకాంత్ మాట్లాడుతూ.. మనం ఒకవైపు వైద్యులను దేవుడిగా భావిస్తాము. మరోవైపు ‘పెట్టుబడిపై రాబడి’ కోరుకునేలా వైద్యవృత్తిని మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. అంటే, మీరు చికిత్స కోసం ఖరీదైన ఆసుపత్రికి వెళ్లినట్లయితే, మేము ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నామని ఊహిస్తుంటారు. కాబట్టి రోగి ఖచ్చితంగా బాగుపడాలి.. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ప్రాణాలు రక్షించబడతాయా అనేది డౌటే. వైద్యులకు కూడా కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. అందువల్ల కొన్నిసార్లు కొందరు డాక్టర్లు దాడులకు, బెదిరింపులకు గురవుతున్నారు. వీటి కారణంగా కొందరు ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తున్నారు.

Read Also:Dinesh Karthik Coach: బిగ్ బ్రేకింగ్.. కోచ్‌గా దినేశ్‌ కార్తీక్‌!