Site icon NTV Telugu

National Cinema Day 2024: సినీ ప్రియులకు శుభవార్త.. కేవలం రూ. 99తో మల్టీఫ్లెక్స్ లలో సినిమా..

National Cinema Day 2024

National Cinema Day 2024

National Cinema Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు. ఈ సంవత్సరం జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 20న, 2024న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా పెద్ద ప్రకటన చేసింది. ఈ రోజున దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే మీకు నచ్చిన సినిమాని వీక్షించవచ్చు. సెప్టెంబరు 20న దేశవ్యాప్తంగా చౌక ధరలకే సినిమాను ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా కేవలం రూ.99 టికెట్ తీసుకుని మీకు నచ్చిన సినిమా చూడొచ్చు..

JK Elections: నేడే మొదటి దశ ఓటింగ్.. బరిలో 219 మంది అభ్యర్థులు…

ఇప్పుడు ఉన్న సినిమా టికెట్ కోసం రూ.300-400 చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఇది 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్‌ లను కలిగి ఉండదు. అయితే., సెప్టెంబర్ 20న దాదాపు అన్ని థియేటర్లు టికెట్ బుకింగ్ ప్రక్రియలో తమ కస్టమర్లకు రూ.99 ఆఫర్ చేయనున్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న సినిమాలకు బాగా ప్లస్ కానున్నాయి. అంతేకాకుండా కొన్ని పాత క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి.

99 రూపాయల టిక్కెట్‌ల ఆఫర్‌ను పొందడానికి, మీ లొకేషన్‌ని ఎంచుకుని, సెప్టెంబర్ 20ని తేదీగా ఎంచుకుని, ఆపై మీరు చూడాలనుకుంటున్న సినిమా పేరును ఎంచుకోండి. దీని తర్వాత, బుక్ యువర్ టికెట్ ఆప్షన్‌కు వెళ్లి మీ సీటును బుక్ చేసి, చెల్లింపు చేయండి. ఇది కాకుండా, సమీపంలోని సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా పేరు చెప్పి 99 రూపాయలకు టిక్కెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version