NTV Telugu Site icon

DD News: డీడీ న్యూస్ లోగో కలర్ మారింది.. ఏ రంగులోకి అంటే..!

Dee

Dee

ఒకప్పుడు న్యూస్ ఛానల్ అంటే గుర్తొచ్చేది దూరదర్శనే. 20వ శతాబ్దం వరకు డీడీ న్యూసే అందరికీ దిక్కుగా ఉండేంది. వార్తలు చూడాలంటే డీడీ న్యూస్‌నే చూసేవారు. ఇప్పుడెందుకు దీని సంగతి అంటారా? ప్రస్తుతం ఇది కొత్త రూపాన్ని సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్ రంగు మార్చుకుంది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉండే డీడీ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఇది కూడా చదవండి: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?

మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది. మాకు ధైర్యం ఉంది… వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని డీడీ న్యూస్ ఓ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూపాన్ని వీడియో ద్వారా చూపించింది.

ఇది కూడా చదవండి: Bridge Collapse: పూంచ్‌ సెక్టార్‌లో గాలివాన దెబ్బకి కూలిన బ్రిడ్జ్..

దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. 1975 నాటికి డీడీ సేవలను ముంబై, అమృత్‌సర్ సహా ఏడు నగరాలకు విస్తరించింది. 1976 ఏప్రిల్ 1న ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు వచ్చింది. 1982లో దూరదర్శన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ అయింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దూరదర్శన్ కలర్ వెర్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో 1982 ఆసియా క్రీడలు కలర్ టెలికాస్ట్ జరిగింది. ప్రస్తుతం దూరదర్శన్ 6 జాతీయ ఛానెల్‌లు, 17 ప్రాంతీయ ఛానెల్‌లను కలిగి ఉంది. జాతీయ ఛానెల్‌లలో DD నేషనల్, ఇండియా, కిసాన్, స్పోర్ట్స్, ఉర్దూ, భారతి ఉన్నాయి. మరోవైపు DD అరుణ్‌ప్రభ, బంగ్లా, బీహార్, చందన, గిర్నార్, మధ్యప్రదేశ్, మలయాళం, నార్త్ ఈస్ట్, ఒడియా, పొధిగై, పంజాబీ, రాజస్థాన్, సహ్యగిరి, సప్తగిరి, ఉత్తర ప్రదేశ్, యాదగిరి, కాశీర్ అనే ప్రాంతీయ ఛానల్‌లను కలిగి ఉంది.