Site icon NTV Telugu

Asteroid Near Earth: భూమికి ప్రమాదం ఉందా? నాసా ఎందుకు ఆందోళనతో ఉంది..

Near Earth Object

Near Earth Object

Asteroid Near Earth: మానవాళి వినాశనానికి రోజులు దగ్గర పడ్డాయా?. శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళనలో ఉన్నారు. భూమికి ప్రమాదం పొంచి ఉందా. అసలు విశ్వంలో ఏం జరుగుతుంది. విశ్వంలో ప్రతిరోజూ ఏవేవో జరుగుతూనే ఉంటాయి. అయితే వాటన్నింటిని శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోరు. కేవలం వాటికి భూమితో ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు మాత్రమే వాటిపై శ్రద్ధ చూపుతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. ఏం జరగబోతుందనే కుతూహలంతో విశ్వాన్ని నిరంతరం గమనిస్తూ ఉన్నారు. ఓ ప్రమాదం భూమి వైపు కదులుతూ శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. ప్రపంచానికి సవాల్‌గా మారిన ఆ ప్రమాదం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Medak- Kamareddy : మెదక్, కామారెడ్డిలో స్కూల్స్ కు రేపు సెలవు

గంటకు 66,600 కి.మీ వేగంతో ప్రమాదం..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఆందోళనలో ఉన్నారు. ఓ పెద్ద ఉల్క శాస్త్రవేత్తల ఆందోళనలకు కారణం అయ్యింది. విశ్వంలో అనేక ఉల్కలు ఉన్నప్పటికీ, నాసా ఈ ఉల్కను ప్రమాదకరమైన వస్తువుల జాబితాలో చేర్చింది. ఈ పెద్ద ఉల్క అంతరిక్షంలో తేలుతోందని నాసా ఆందోళనను వ్యక్తం చేస్తుంది. ఈ ఉల్క వేగం గంటకు 66,600 కి.మీటర్లుగా ఉండగా, దాని పొడవు190 అడుగుల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. దీంతో దానిపై నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు, ప్రతి కదలికను అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉల్క భూమికి చాలా దగ్గరగా వెళుతుందని చెప్పారు. ఈ ఉల్క పొడవు దాదాపు 190 అడుగులు (58 మీటర్లు). ఇది బహుళ అంతస్తుల భవనానికి సమానం. ఇది అంతరిక్షంలో దాదాపు 41,390 మైళ్ల వేగంతో అంటే గంటకు 66,600 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ ఉల్క పేరు 2025 PM2 అని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఉల్క చంద్రుడి నుంచి భూమికి కేవలం 10 రెట్లు దూరంలో వెళుతుంది. 2025 PM2 గురించి, NASA, ఇతర అంతరిక్ష సంస్థలు ఈ గ్రహశకలం ప్రస్తుతానికి భూమికి ముప్పు కాదని స్పష్టం చేశాయి. ఇది Aten అనే సమూహంలో భాగమని, ఇందులో భూమి కక్ష్యను ఢీకొట్టగల గ్రహశకలాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సాధారణంగా అవి స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే NASA దానిని ఎందుకు ముప్పుగా చూసింది అనేది.

ఉల్కను ఎప్పుడు భూమికి ముప్పుగా పరిగణిస్తారంటే..
ఆ ఉల్క 74 లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించినప్పుడు. అలాగే దాని పరిమాణం 85 మీటర్ల కంటే ఎక్కువగా ఉందన్నప్పుడు దానిని భూమికి సమస్యగా పరిగణిస్తారు. 2025 PM2 భారీ పరిమాణం ఈ పరామితిలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే దాని దూరం ప్రమాద పరిమితికి వెలుపల ఉంది. దీంతో దానిని భూమికి దగ్గరగా ఉన్న వస్తువుగా చూస్తున్నారు. భూమి నుంచి దాని దగ్గరి దూరం 23.1 లక్షల మైళ్లు అంటే దాదాపు 37.2 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరం చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అంతరిక్ష పరామితులలో ఇది చాలా దగ్గరగా పరిగణిస్తారు. ఈ గ్రహశకలం భూమి నుంచి సురక్షితమైన దూరం నుంచి వెళుతుంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలకు ఇటువంటి సంఘటనలు చాలా ముఖ్యమైనవని, అంతరిక్షంలో స్వల్ప గురుత్వాకర్షణ మార్పు లేదా మరొక వస్తువుతో ఢీకొనడం ఒక గ్రహశకలం దిశను మార్చగలదని చెబుతున్నారు.

READ ALSO: CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!

Exit mobile version