Artemis 1 Moon Mission: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాసా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మానవ రహిత రాకెట్ ఆర్టెమిస్ -1 ఎట్టకేలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి చంద్రునిపైకి ఆర్టెమిస్ ప్రయాణం సాగింది. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ఉదయం 01:47 గంటలకు ప్రయోగించారు. ఆర్టెమిస్‌కు ఒకదాని వెంట ఒకటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇంధనం లీకేజీతో ఆర్టెమిస్‌కు సైంటిస్టులు మరమ్మతులు చేశారు.కౌంట్ డౌన్ నిలిపివేసిన నాసా మరమ్మత్తులు పూర్తి చేసింది. ఉదయం 1:04 గంటలకు తెరిచిన రెండు గంటల లాంచ్ విండోలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రయోగం జరిగింది. వాల్వ్ లీక్ కారణంగా ఇంజినీర్లు మంగళవారం రాత్రి కోర్ స్టేజ్‌లోకి ద్రవ హైడ్రోజన్ ప్రవాహాన్ని పాజ్ చేయవలసి వచ్చింది, అయితే లాంచ్ ప్యాడ్‌కి పంపిన బృందం గంట తర్వాత సమస్యను పరిష్కరించింది. అనంతరం ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా గతంలో ఆర్టెమిస్ ప్రయోగం రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆర్టెమిస్ -2లో వ్యోమగాములను నాసా పంపనుందని సమాచారం.
సాంకేతిక కారణాల వల్ల గతంలో రెండు ప్రయోగ ప్రయత్నాలు రద్దు కావడంతో నాసాకు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సెప్టెంబరు చివరలో ఫ్లోరిడాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇయాన్‌తో సహా వాతావరణ వైఫల్యాల కారణంగా లాంచ్ కూడా ఆలస్యమైంది. రాత్రి రాకెట్ దూసుకెళ్తుందని ప్రకటించడంతో సముద్రతీరంలో సుమారు 100,000 మంది ప్రజలు ప్రయోగాన్ని వీక్షించారు.
తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్‌కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్-1ను ఇవాళ ప్రయోగించారు.
We are going.
For the first time, the @NASA_SLS rocket and @NASA_Orion fly together. #Artemis I begins a new chapter in human lunar exploration. pic.twitter.com/vmC64Qgft9
— NASA (@NASA) November 16, 2022
