Site icon NTV Telugu

GSLV-F16 NISAR: కొనసాగుతోన్న పీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 16 కౌంట్‌డౌన్‌.. నేడు నింగిలోకి నిసార్‌..

Gslv F16 Nisar

Gslv F16 Nisar

GSLV-F16 NISAR: నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అడవులు, మైదానాలు, కొండలు పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటిని అధ్యయనం చేయనుంది నిసార్.. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుండగా.. జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ శాటిలైట్ ను జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక ద్వారా నింగులోకి పంపనున్న నేపథ్యంలో.. రెండు రోజులుగా షార్‌లోనే ఇస్రో, నాసా అమెరికన్ శాస్తవ్రేత్తలు మకాం వేశారు..

Read Also: Lokesh ; అజిత్‌తో సినిమా ప్లాన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Exit mobile version