Site icon NTV Telugu

Super-Earth: భూమి లాంటి గ్రహాన్ని కనుక్కున్న నాసా..

Super Earth

Super Earth

NASA Discovers Super-Earth: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలను కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు భూమిని పోలిన అనేక గ్రహాలను కనుక్కున్నారు. తాజాగా మరోసారి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి భూమి లాంటి గ్రహాన్ని కనుక్కుంది. నాసా కనుక్కున్న సూపర్ ఎర్త్ భూమి పరిమాణం కన్నా 4 రెట్లు పెద్దగిగా ఉంది. తన నక్షత్రం చుట్టూ కేవలం 10.8 భూమి రోజుల్లోనే ఒక ఏడాదిని పూర్తి చేస్తోందని వెల్లడించారు సైంటిస్టులు.

రాస్ 508-బీగా పిలువబడే ఈ భారీ భూమి లాంటి గ్రహం ఎం4.5 రాస్ 508 అనే మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమిలాగానే.. రాస్ 508-బీ గ్రహం నక్షత్రం నుంచి నివాసయోగ్యమైన( హాబిటేబల్ జోన్) ప్రాంతంలోనే పరిభ్రమిస్తోంది. ఈ విషయాన్ని నాసా ఎక్సోప్లానెట్ ఇన్ ఫ్రారెడ్ మానిటరింగ్ టెక్నిక్ ద్వారా కనుక్కుంది. ఈ సూపర్ ఎర్త్, మన భూమి నుంచి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ప్రస్తుతం రాస్ 508-బీ గ్రహం హబిటెబుల్ జోన్ లో ఉండటం వల్ల గ్రహం ఉపరితలంపై నీరు ఉండే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చిన్న మరుగుజ్జు నక్షత్రం కావడంతో ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ తిరగడానికి కేవలం 10 రోజులు మాత్రమే తీసుకుంటుంది.

Read Also: New Delhi: ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భారీ భద్రత

ఈ ఏడాది ప్రారంభంలోనే జపాన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ గ్రహాన్ని కనుక్కున్నారు. ప్రస్తుతం గ్రహం తిరుగుతున్న నక్షత్రం మరగుజ్జు నక్షత్రంగా ఉందని.. దీని పరిమాణం సూర్యుడి పరిమాణంలో కేవలం 18 శాతం మాత్రమే ఉంది. భూమి సూర్యుడి నుంచి గ్రహించే శక్తి కన్నా 1.4 రెట్ల శక్తిని రాస్ 508-బీ గ్రహం గ్రహిస్తోంది.

 

 

Exit mobile version