School Bus Fire: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో లేరు. పోలీసుల సమాచారం ప్రకారం.. బస్సు డ్రైవర్ విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపి, బస్సును ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. కొద్ది సేపటికే బస్సు ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించాడు. అప్పటికే మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అయితే బస్సు కొంతమేరకు దగ్ధమైందని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
READ MORE: Fastag New Rule: నవంబర్ 15 నుంచి మారబోతోన్న ఈ టోల్ రూల్.. ఈ తప్పు చేస్తే భారీ నష్టం!
