Site icon NTV Telugu

Rangareddy: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేత

Narsingi

Narsingi

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వరదల కారణంగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతారంయ ఏర్పడింది. ఇక ఇప్పుడు నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు అధికారులు. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మంచిరేవుల బ్రిడ్జి పైనుంచి మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో మంచిరేవుల – నార్సింగికి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.

Exit mobile version