Double Murder : నార్సింగి జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగ్న వీడియోలు తీసేందుకు నిరాకరించినందుకు మహిళను చంపినట్లు పోలీసులు గుర్తించారు. నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అంకిత్ అనే వ్యక్తికి మహిళ చెప్పడంతో.. ఉద్దేశపూర్వకంగానే మహిళని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దుండగులు హతమార్చారు. ఈ కేసులో నిందితులు రాహుల్ కుమార్ సాకేత్, రాజ్ కుమార్ సాకేత్, సుఖీంద్ర కుమార్ సాకేత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బిందు అనే మహిళతో రెండు సార్లు లైంగికంగా రాహుల్ కుమార్ సాకేత్ కలిశాడు. అయితే.. ఆ సమయంలో వీడియో తీసేందుకు యత్నించాడు రాహుల్ కుమార్. దీంతో.. రాహుల్‌ను హెచ్చరించి ఇదే విషయాన్ని మృతడు అంకిత్ సాకేత్‌కి చెప్పింది బిందు. ఇదే విషయంపై రాహుల్ కుమార్ సాకేత్ కు అంకిత్ కుమార్ కు గొడవ జరిగింది.
Minister Seethakka : అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి
ఈ నేపథ్యంలో అంకిత్‌ను స్నేహితుల సహకారంతో హతమార్చాలని రాహుల్ కుమార్ భావించాడు. పథకం ప్రకారం.. మృతుడు అంకిత్ ద్వారా బిందును ఎంగేజ్ చేసుకున్న రాహుల్ కుమార్ సాకేత్… సుఖీంద్ర కుమార్ సాకేత్‌తో బిందు ఉండగా అంకిత్‌ను రాహుల్, రాజ్ కుమార్ హత్య చేశారు. అంకిత్‌ని హతమార్చే క్రమంలో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. అయితే.. అంకిత్‌ను హతమార్చిన తర్వాత బిందను కూడా హతమార్చారు నిందితులు. జంట హత్యల తరువాత ముగ్గురు నిందితులు అరెస్ట్ మధ్యప్రదేశ్ పరారయ్యారు. అయితే.. మధ్యప్రదేశలోని స్థానిక కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు నార్సింగి పోలీసులు.
Central Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక