Naresh : గన్ లైసెన్స్ కోసం పోలీసులను ఆశ్రయించిన నరేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీ గా వున్నారు.. ఎలాంటి పాత్ర అయిన అద్భుతంగా నటిస్తారు ఆయన. కానీ ఆయన వ్యక్తిగత జీవితం అంతా వివాదాలతో నిండి ఉంది.ఆయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. పెళ్లి కాకుండా పవిత్ర లోకేష్ తో ఆయన కలిసి వుంటున్నారు.వీరిద్దరి రిలేషన్ ని నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు. రమ్య రఘుపతి నరేష్ కి ఇంకా విడాకులు ఇవ్వలేదు.నరేష్ విడాకులు కావాలని కోరుతున్నా ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు..ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలు అయ్యాయి.నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేశారు. నరేష్ కి అమ్మాయిల పిచ్చి ఉంది అని ఎప్పుడూ నీలి చిత్రాలు చూస్తుంటాడు అని ఆమె ఆరోపించింది.నరేష్ వ్యసనాల గురించి విజయనిర్మల గారికి కూడా తెలుసు. ఎప్పటికైనా నరేష్ మారతాడని నాకు నచ్చజెప్పేవారు అని రమ్య రఘుపతి ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.రమ్య చేసిన అలాంటి ఆరోపణలకు నరేష్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. రమ్య నా ఫోన్ ను ట్యాప్ చేసింది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది.డబ్బుల కోసం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. అలాగే నన్ను చంపించేందుకు తన మనుషులతో రెక్కీ కూడా చేయించింది అని చెప్పుకొచ్చారు.
రమ్య చేసిన ఆరోపణలకు నరేష్ బాగా మండి పడ్డారు. ఇటీవల నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. వారిరువురి వ్యక్తిగత జీవితం ఆధారంగా దర్శకుడు ఎం. ఎస్. రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రం రీసెంట్ గా ఓటీటీ లోకి కూడా వచ్చింది.అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా ఓటీటీ సంస్థలలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.ఈ సినిమా లో నా క్యారెక్టర్ ని తప్పుగా చూపించారు అంటూ రమ్య రఘుపతి కోర్ట్ ను ఆశ్రయించింది..దీనితో లీగల్ ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపి వేసింది.ఇదిలా ఉండగా తన మూడో భార్యతో నరేష్ కి వివాదాలు నడుస్తుండగా ఆయన తుపాకీ లైసెన్సు కోసం పోలీస్ అధికారులని ఆశ్రయించారు.పుట్టపర్తి జిల్లా ఎస్పీని కలిసిన నరేష్ తుపాకీ లైసెన్సు జారీ చేయాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని, ఆత్మ రక్షణ కోసం ఆయుధం కావాలని నరేష్ కోరినట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!