Site icon NTV Telugu

Naresh Comments on Saree: చీర వస్త్రధారణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్! నటుడు సురేష్ ఏమన్నారంటే?

Naresh

Naresh

Naresh Comments on Saree: ఇటీవల జరిగిన “హే భగవాన్” సినిమా ఈవెంట్‌లో నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. మహిళల వస్త్రధారణ, ముఖ్యంగా చీర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?

“హే భగవాన్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన నరేష్, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో మహిళలు ఎక్కువగా చీరలోనే కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. చీర భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధారణ అని ఆయన అన్నారు. వాలెంటైన్ వీక్‌లో భాగమైన ‘హగ్ డే’ సందర్భంగా ఈవెంట్‌లో ఉన్న టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ నరేష్ సరదాగా మాట్లాడారు.

Ragi Ambali Recipe: ఎండకాలం వచ్చేస్తుంది.. ఉపశమనం కోసం ‘రాగి అంబలి’! చేసేయండి ఇలా!

వేదికపై ఉన్న శివాని నాగారం, చొక్కారపు శ్రవంతి చీరలు ధరించి రావడాన్ని ప్రస్తావిస్తూ.. “మిమ్మల్ని కూడా హగ్ చేయాలనుకున్నాను, కానీ మీరు చీరలో ఉన్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు-ఆడవాళ్లు హగ్ చేసుకోవడం సరైంది కాదు.. కాబట్టి, మీరు ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకోండి” అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ నవ్వులు పూయించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని సరదా వ్యాఖ్యగా తీసుకుంటే, మరికొందరు మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యానించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version