NTV Telugu Site icon

Delhi: రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి

Modi 2

Modi 2

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని మోడీ కోరారు. తీర్మానాన్ని పత్రాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని రాష్ట్రపతి ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: Car Accident: టోల్​ గేట్ ఉద్యోగి ​పైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..

శుక్రవారం మోడీని ఎన్డీఏ పక్ష నేతగా  ఎంపీలు ఎన్నుకున్నారు. ఇక రాష్ట్రపతితో సమావేశం అనంతరం మరోసారి ఎన్డీయే సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రి పదవులు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జూన్ 9న సాయంత్రం 6గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలతో పాటు ఆయా దేశాధినేతలు హాజరుకానున్నారు.

శుక్రవారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ పక్షనేతగా మోడీని ఎన్నుకున్నారు. ఎన్డీఏలో జనతాదళ్-యునైటెడ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనతాదళ్ సెక్యులర్, శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ దళ్ మరియు ఇతర పార్టీలు ఉన్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌ 272కు బీజేపీ దూరమైంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం. కూటమి సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 293కు చేరింది. ఇక ఇండియా కూటమి 232 సీట్లు సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ.. జూన్ 9న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి దేశం నుంచే కాకుండా ఆయా దేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు.

Show comments