NTV Telugu Site icon

Congress: నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్.. అభ్యర్థి మార్పు

Narayankhed

Narayankhed

నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో నారాయణఖేడ్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సురేశ్‌ షెట్కార్‌కు టికెట్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్‌.. తాజాగా సంజీవ్‌రెడ్డికి ఇస్తున్నట్లు వెల్లడించింది. టికెట్‌ మార్పు నేపథ్యంలో సురేశ్‌ షెట్కార్‌, సంజీవ్‌రెడ్డి మధ్య హస్తం పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చారు. దీంతో సంజీవ్‌ రెడ్డి అభ్యర్థిత్వానికి సురేశ్‌ షెట్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్‌ దక్కని నేపథ్యంలో లోక్‌సభ టికెట్ ఇస్తామని సురేశ్‌ షెట్కార్‌కు కాంగ్రెస్‌ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Read Also: Bigg Boss7: జై జవాన్, జై కిసాన్ మల్లొచ్చినా బాపు.. కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్!

అయితే, తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ని ప్రకటించారు.. కానీ అనుహ్య పరిణామాలతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డికి బీ ఫామ్ అందించనున్నారు. ఇక, రిటర్నింగ్ కార్యాలయం నుంచి సురేష్ షెట్కార్ వర్గీయులు నిరాశతో వేనుదిరిగారు. దీంతో నామినేషన్ వేసేందుకు సంజీవ రెడ్డి లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లో సంజీవ రెడ్డికి ఏఐసీసీ నేతలు బీ- ఫామ్ అందించనున్నారు.

Read Also: BSP Final List: 20 మందితో బిఎస్పీ ఐదో జాబితా విడుదల.. పెండింగ్ లో పటాన్ చెరు

అయితే, టికెట్ రాని వారు ఎవరిని చూసి ఇబ్బంది పడొద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వంలో టికెట్ రాని నేతలు కూడా భాగస్వామ్యం అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. మీ అందరి రాజకీయ భవిష్యత్తుకు బాధ్యత నాదే అని కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు తుంగతుర్తి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.