Site icon NTV Telugu

ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎంఎం నరవాణే నియామకం

దేశపు తొలి సీడీఎస్ బిపిన్ రావత్ఈయన హఠాన్మరణంతో సీడీఎస్ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది.తమిళనాడులో జరిగిన ఘోర హెలీకాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీలో అత్యున్నత అధికారి ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం పాలైన సంగతి తెల్సిందే. దీంతో సీడీఎస్‌ స్థానం ఖాళీ అయింది. దేశ రక్షణ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే ఈ ఖాళీని భర్తీ చేసింది. బిపిన్‌ రావత్‌ స్థానంలో దేశపు కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్‌గా, రెండవ అధిపతిగా జనరల్ ఎంఎం నరవణే బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ ఛీఫ్‌గా బిపిన్ రావత్ ఉన్న సమయంలో త్రివిధ దళాలకు అధిపతిగా ఉన్న ఎంఎం నరవణేను కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించారు.

Also Read: భారత క్రికెట్ టీం లో గొడవలు..అసలేం జరుగుతుంది ?

నరవణే ప్రస్తుతం ఆర్మీ, వాయు, నేవీ మూడు విభాగాల్లో సీనియర్‌గా ఉండటంతో పాటు త్రివిధ దళాలకు ఆయననే ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాల ఛీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. త్రివిధ దళాల విషయంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నిర్ణయం తీసుకునే అధికారముంటుంది.ఈ పదవిని సృష్టించకముందు త్రివిధ దళాలకు ఛీఫ్‌గా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సీనియర్‌గా ఉన్న ఛీఫ్‌ని ఎన్నుకునేవారు. సీడీఎస్ ఛీఫ్‌గా నియమితులైన ఎంఎం నరవణేకు మంచి క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరుంది.

Exit mobile version