Narakasura: ఓటీటీలోకి వచ్చేసిన నరకాసుర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ నావో అకోస్టా దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు..ప్రమోషన్లు కూడా అంతగా జరగకపోవటంతో ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. కాగా, ఇప్పుడు ఈ నరకాసుర మూవీ ఓటీటీలోకి సడెన్‍గా వచ్చేసింది. అయితే, ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా రెంటల్ బేసిస్‍లో స్ట్రీమింగ్‍కు రావడం ట్విస్టుగా ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నరకాసుర చిత్రం రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంటే ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు కూడా ఈ చిత్రాన్ని చూడాలంటే ప్రస్తుతం రూ.79 రెంట్ చెల్లించాలి. స్టార్ హీరోల సినిమాలే సాధారణంగా స్ట్రీమింగ్‍కు వస్తుంటే.. నరకాసుర మాత్రం రెంటల్ విధానంలో స్ట్రీమ్ అవుతుంది.అయితే, కొద్ది రోజుల తర్వాత ఈ చిత్రం అందరికీ ఉచితంగా రెంటల్ లేకుండా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.
నరకాసుర చిత్రంలో రక్షిత్ అట్లూరి హీరోగా చేయగా.. అపర్ణా జనార్దన్, సంగీతా విపిన్, శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమన్,తేజ్ చరణ్‍రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. సెబాస్టియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాఫర్ రాజా సంగీతం అందించారు. అజ్జా శ్రీనివాస్ మరియు కురుమారు రఘు ఈ చిత్రాన్ని నిర్మించారు.నరకాసుర సినిమా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో శివ (రక్షిత్ అట్లూరి) నివసిస్తుంటాడు. కాఫీ, మిరపను తరలించే లారీ డ్రైవర్‌గా అతడు పని చేస్తుంటాడు. అక్కడి ఎమ్మెల్యే నాగమ నాయుడు (చరణ్ తేజ)కు విధేయుడిగా శివ ఉంటాడు. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేస్తుంటాడు. గొడవలకు దిగేందుకు కూడా వెనుకాడడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు ఆది నాయుడు (తేజ చరణ్ రేజ్)తో శివకు గొడవ అవుతుంది. ఆ తర్వాత సడెన్‍గా శివ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళతాడు. ఆ తర్వాత అస్సలు ఏమైంది? శివ ఏమయ్యాడు? శివ, ఆది మధ్య గొడవకు కారణమేంటి? మళ్లీ శివ తిరిగొచ్చాడా? ట్రాన్స్‌జెండర్లకు ఈ కథతో సంబంధం ఏంటి? అనేదే నరకాసుర మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Tags
- Narakasura
- OTT
- Streaming
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!