Site icon NTV Telugu

Nara Lokesh: తొలి రోజు 50 ప్రశ్నలు.. రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్‌

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో మరోసారి సీఐడీ ముందు హాజరుకానున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. సీఐడీ నోటీసులు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు లోకేష్‌.. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌పై నిన్న ఆరు గంటల పాటు ప్రశ్నలు సంధించారు సీఐడీ అధికారులు.. తొలి రోజు లోకేష్ కు సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో హెరిటేజ్ సంస్థలకు లబ్ధిచేకూరేలావ్యవహరిచాడని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చాలని సీఆర్డీఏపై ఒత్తిడి తెచ్చారనే విషయాలపై లోకేష్ కు ప్రశ్నించారని తెలుస్తోంది.. అయితే, నారా లోకేష్ విచారణకు సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నమాట.. చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పినట్టు సమాచారం..

Read Also: Astrology: అక్టోబర్‌ 11, బుధవారం దినఫలాలు

అయితే, ఐఆర్ఆర్ కేసులో మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చింది సీఐడీ.. దీంతో.. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లనున్నారు నారా లోకేష్. ఇక, సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్‌.. 50 ప్రశ్నల్లో 49 ప్రశ్నలు రింగ్‌రోడ్డుతో లింక్‌ లేని ప్రశ్నలే అన్నారు.. వాటికి గూగుల్‌లో వెతికినా జవాబులు తెలుస్తాయని సెటైర్లు వేశారు.. అయినా.. సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.. 2017లో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు నా ముందు పెడితే వాటికి సమాధానమిస్తానని చెప్పాను.. అందుకు సంబంధించిన ఆధారాలేవీ వారు చూపించలేదన్నారు నారా లోకేష్‌.. ఇక, రెండో రోజు నారా లోకేష్‌పై సీఐడీ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అనేది వేచి చూడాలి.

Exit mobile version