Nara Lokesh: తుని రూరల్ గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలియడంతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన స్పందిస్తూ.. జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అమానుష ఘటనలకు పాల్పడే వ్యక్తులెవరైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి హెచ్చరించారు.
ఇక ఈ ఘటనలో బాధితురాలికి ధైర్యం చెప్పి ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
Pakistan: జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ నయా ప్లాన్.. ఆన్లైన్‌లో ముస్లిం మహిళలకు జీహాదీ క్లాసులు..!
