Site icon NTV Telugu

Nara Lokesh: ఇక పై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అమలు..

Nara Lokesh

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఈ సందర్బంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ.. తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశాం.. అర్హులు ఎంత మంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లయింట్ ద్వారా దానిని పరిష్కరిస్తామన్నారు.

Also Read:Plane Crash: ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైద్య విద్యార్థి..

గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం 42లక్షల మంది పిల్లలకు మాత్రమే నిధులు ఇచ్చారు.. 2శాతం మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్ ఉంది.. వారిని మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశాం.. డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర ద్వారా పిల్లలకు స్కూల్ కిట్ అందజేత.. ఇక పై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం అమలు.. వన్ క్లాస్ వన్ టీచర్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా కరెంట్ సరఫరా.. జూన్ 25 లోగా తల్లికి వందనం డబ్బులు జమ అవుతాయని అన్నారు.

Exit mobile version