Nara Lokesh: ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక.. రామ్మోహన్‌ నాయుడు ఇంట్లో లోకేష్‌ సందడి..

  • ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక..
  • సందడి చేసిన మంత్రి నారా లోకేష్..
  • కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ఇంట్లో విందు
Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రామ్మోహన్‌ నాయుడు మాతృమూర్తి లోకేష్‌ను ఆశీర్వదించారు. రామన్న పిల్లలను ఎత్తుకున్న లోకేష్ వారితో సరదాగా మాట్లాడించారు. పెద్దమ్మ పురందరేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు.. ఎంపీలందరినీ పేరుపేరునా పలకరించారు.. ఇక, రామ్మోహన్‌ నాయుడు దంపతులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన.. వారి పిల్లలను ఎత్తుకొని.. ఆడిస్తూ.. సందడి చేశారు. కాగా, ఈ మధ్య ప్రజా ప్రతినిధులను వారి కుటుంబ సభ్యులతో సహా కలుస్తూ.. వారి యోగ క్షేమాలను సైతం మంత్రి నారా లోకేష్ తెలుసుకున్న విషయం విదితమే..