Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు

  • సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన..
  • భారత్-కొరియా సంబంధాల బలోపేతంలో నూతన అధ్యాయం..
  • వారంరోజుల పర్యటనలో 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు..
  • లోకేష్ స్పీడ్ చూసి పల్లి.. పల్లి మంత్రి అంటూ కొరియన్ ప్రతినిధుల ప్రశంసలు..
Nara Lokesh South Korea Vis

Nara Lokesh South Korea Vis

Nara Lokesh South Korea visit: భారత్ – కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా సౌత్ కొరియా ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ చేపట్టారు.. ఇక, లోకేష్ బృందానికి దక్షిణ కొరియా ప్రభుత్వంతోపాటు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సముచిత గౌరవం లభించింది. ఎల్జీ లాంటి గ్లోబల్ కంపెనీలు ప్రత్యేకంగా తమ హెడ్ క్వార్టర్స్ కు ఆహ్వానించి ఉన్నతస్థాయి బృందంతో గౌరవార్థ విందు ఇవ్వడం మంత్రి లోకేష్‌కు దక్కిన అరుదైన గౌరవం. ఈనెల 5నుంచి 11వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పోరేట్ సంస్థల నాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లోకేష్ కోరారు. తొలిరోజు సియోల్‌లో తెలుగు ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన పర్యటన… సీఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో నిర్వహించిన రోడ్ షోతో ముగిసింది.

రాష్ట్రంతో ద్వైపాక్షిక, రాజకీయ, వాణిజ్య సహకారాన్ని బలోపేతం ప్రాధాన్యతను గుర్తిస్తూ, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి లోకేష్‌ను అధికారికంగా ఈ పర్యటనకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తో నిర్వహించిన భేటీల అనంతరం ఎల్జీ, హ్యుందయ్, శాంసంగ్, బీఎన్ కే ఫైనాన్షియల్ వంటి దిగ్గజ కొరియన్ కార్పొరేట్ సంస్థలు, తమ ఉన్నత నాయకత్వంతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్ తో వివిధ సంస్థల ప్రతినిధి బృందాలను ఆకట్టుకున్నాయి..

పర్యటన తొలిరోజున సియోల్ లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్ తో నిర్వహించిన మర్యాదపూర్వక భేటీలో కొరియా ప్రాధాన్యతారంగ పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ విజన్‌ను ఆవిష్కరించారు. దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ లో ఏపీఈడీబీ ఆధ్వర్యాన అపెక్స్ – కొరియా పేరిట పెట్టుబడిదారుల సహాయక, అనుసంధాన విభాగం ను ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలకు నిదర్శనం. శ్రీసిటీ పరిసరాల్లో ఇప్పటికే కొలువై ఉన్న 40కిపైగా కొరియన్ కంపెనీలతోపాటు కొత్తగా వచ్చేందుకు ఆసక్తి చూపే సంస్థలకు భరోసా ఇచ్చినట్లయింది.

ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండేళ్ల వ్యవధిలో ‘కియా’ సాధించిన విజయాన్ని ఉదహరిస్తూ, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, 3ఎస్ మోడల్ (స్పీడ్, స్పెబిలిటీ, సర్వీస్), వేగవంతమైన అనుమతులపై మంత్రి లోకేష్ వివరించిన తీరుపై కొరియా మీడియా, దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బృందం పర్యటనపై కోట్రా (Kotra) దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్‌హూన్ కిమ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ… నారా లోకేష్ బృందానికి హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో అభినందనలు తెలపడం పర్యటన విజయవంతానికి నిదర్శనం. కొరియన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ వేగం చూసి పల్లి.. పల్లి మంత్రి అని కొత్త పేరు పెట్టారు. పల్లి..పల్లి అనే కొరియన్ పదానికి అర్థం త్వరగా.. త్వరగా అని.. వారంరోజుల అధికారిక పర్యటనను పెట్టుబడుల యాత్రగా మార్చిన మంత్రి లోకేష్ లౌక్యం రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి, కమిట్ మెంట్ ను తెలియజేస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు..