Site icon NTV Telugu

Nara Lokesh: సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం.. వాళ్ళు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు..

Nara Lokesh

Nara Lokesh

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ ఢిల్లీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు అని తెలిపారు. బాబు రిమాండ్ కు వెళ్ళే ముందు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడాలి అన్నారు.. అన్ని నియోజక వర్గాల్లో ప్రజలు ఆందోళన చేస్తారు.. సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేని కేసును తీసుకు వచ్చారు.. ఇన్నర్ రింగ్ రోడ్ లేదు కానీ.. స్కాం ఉందట అని లోకేశ్ అన్నారు.

Read Also: Bengal: బెంగాల్ నుండి ఢిల్లీకి బయల్దేరిన 4వేల మంది MNREGA కార్మికులు

డీజీపీ పైన సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తప్పు జరుగలేదు.. కుంభకోణం జరుగలేదు.. ఏనాడూ తప్పు చేయలేదు మేము.. వాళ్ళ లాగా క్విడ్ ప్రోకో చెయ్యలేదు.. అక్టోబర్ 4వ తారీఖున వంద శాతం సీఐడీ అధికారుల ముందు హాజరవుతాను అంటూ ఆయన పేర్కొన్నారు. మాకు వాయిదాలు అడిగే అలవాటు లేదు.. ఇవి దొంగ కేసులు.. ఎలాంటి ఆధారాలు లేవు.. మేం పారిపొం..సీఐడీ అధికారులు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు.. ఈ కేసులన్నీ కక్ష్య సాధింపే.. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు అని లోకేశ్ అన్నారు.

Read Also: Audimulapu Suresh: ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలనేది లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది..?

ఇక, ఇప్పటికే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదు కాగా, ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో సీఐడీ పేర్కొనింది.

Exit mobile version