NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: నేటి నుంచి రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన..

Bhuvaneshwari

Bhuvaneshwari

ఇవాళ్టి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించ‌బోతున్నారు. ఈ రోజు నుంచి 23 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె పర్యటన కొన‌సాగుతుంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన జరుగనుంది. ఇక, చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు నారా భువనేశ్వరి వెళ్లనున్నారు. 2 రోజుల్లో 15 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి 3 లక్షలు రూపాయల చొప్పున‌ ఆర్థిక సాయం అందించనున్నారు. భువనేశ్వరి పర్యటనలో భాగంగా రేపు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో మహిళలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక, అలాగే నియోజకవర్గంలో పలు చోట్ల అన్నా క్యాంటీన్లను కూడా నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు.

Read Also: Health Tips : పరగడుపున కిస్ మిస్ ను తింటే ఏమౌతుందో తెలుసా?

అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు.  అందులో భాగంగానే టీడీపీ- జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నారు.