Site icon NTV Telugu

TDP Protest: జైల్లో చంద్రబాబు.. జైలు బయట భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష

Bhuvaneshwari

Bhuvaneshwari

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా నారా భువనేశ్వరి నిరాహార‌ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు సత్యమేవ జయతే అనే పేరును పెట్టారు. దీక్షకు ముందు రాజమహేంద్రవరంలోని గాంధీ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక, భువనేశ్వరి వెంట తెలుగు మ‌హిళ‌ల నేతలు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. మహాత్మ గాంధీ జ‌యంతి రోజున ఒక్క రోజుకు నారా భువనేశ్వరి దీక్షకు దిగింది. సాయంత్ర 5గంట‌ల వ‌ర‌కు ఈ దీక్ష చేయనున్నారు. ఇటు రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు కూడా దీక్ష చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ లకు నిరసనగా ఆయ‌న నిరసన చేస్తున్నారు. నారా భువనేశ్వరికి మద్దుతుగా చంద్రబాబు, నారా లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేత‌లు, కార్యకర్తలు ఈ దీక్ష చేస్తున్నారు.

Read Also: Asian Games 2023: టేబుల్‌ టెన్నిస్‌లో చరిత్ర.. రోలర్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు!

అయితే, చంద్రబాబు నాయుడు గ‌త 23 రోజులుగా రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో ఆయ‌నకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఇది త‌ప్పుడు కేసు అని.. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిష‌న్ వేసినప్పటికి అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖలు చేయగా.. దానిపై రేపు విచ‌ర‌ణ జ‌రుగుతుంది. ఇక, నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ఆమె అన్నారు. ఆయన జ్ఞాపకాలతో ఈరోజు తన గుండె నిండిపోయింది.. ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా సత్యానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని ఎన్టీఆర్ తమకు నేర్పించారని భువనేశ్వరి తెలిపారు.న్యాయానికి ఆయన కట్టుబడిన విధానం, తెలుగు ప్రజలకు సేవ చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన విధానం.. ఆయన పిల్లలుగా మా అందరికి స్ఫూర్తిదాయకమని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

Exit mobile version