‘వైద్యో నారాయణో హరిః’ అన్న సామెత ప్రకారం వైద్యుడు దేవుడితో సమానం. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనకు వైద్యం చేసి బ్రతికించే వైద్యుడు నిజంగా దేవుడితో సమానం. సమాజంలో వైద్యల సేవలు మరవలేనివి. అయితే.. అలాంటి వైద్యులే ఒక్కటై ప్రజల కోసం మరింత ముందడుగు వేయడం అనేది వారి గొప్పతనానికి నిదర్శనం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివి.. అమెరికాలో స్థిరపడిన వైద్య నిపుణులు ఏపీ రాష్ట్ర ప్రజల కోసం దేశానికే గర్వకారణంగా నాట్కో కాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంపై వారికి ఉన్న ప్రేమకు నిదర్శనం. అయితే.. ఈనెల 1న అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండోలో గుంటూరు, రంగరాయ, సిద్ధార్థ్ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల 18వ ద్వైవార్షిక సదస్సు ఎంతో ముచ్చటగా జరిగింది. ఈ సందర్భంగా నాట్కో ఫార్మా కార్యనిర్వాహక ఉపా ధ్యక్షుడు నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో క్యాన్సర్ కేంద్రాన్ని నిర్మించామని వెల్లడించారు.
Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల వరదలు.. పవన్ ఆరు కోట్ల విరాళం
నాట్కో ( Network and Alliance of Transplant Coordinators) ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రూ. 45 కోట్లతో ఆధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మించామని నన్నపనేని సదాశివరావు తెలిపారు. ఇది రాష్ట్రానికి రెఫరల్ ఆసుపత్రిగా మారిందని ఆయన కొనియాడారు. రోగుల రద్దీ దృష్ట్యా మరో రూ.20 కోట్లతో వార్డును నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఈ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగం, ఆర్థో వార్డులు ఆధునికీకరించామని, జింకాన చేపట్టే ప్రాజెక్టులకు సాంకేతిక సాయం అందిస్తామని నన్నపనేని సదాశివరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ లాల్ బహదూర్ నాగభైరు, జింకాన అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్ వేములపల్లి, పూర్వ అధ్యక్షుడు రవికుమార్ త్రిపురనేని, మాజీ మంత్రి కామినేని శ్రీని డీజీ వాస్, గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ కిరణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
CM Chandrababu: అంతా బుడమేరుతోనే.. కబ్జాలు తొలగిస్తాం..