Site icon NTV Telugu

TheParadise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్..

Nani Paradise

Nani Paradise

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యారడైజ్’. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ అనుకున్న టైమ్ కు షూట్ అవకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు. అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్త డేట్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జూన్ 26, 2026న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : Nithiin : సొంత నిర్మాణ సంస్థలో నితిన్ సినిమా.. దర్శకుడు ఎవరంటే

ఆ రోజున మొహరం సెలవు ఉండటంతో పాటు, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. సమ్మర్ ముగింపులో వచ్చే ఈ తేదీ సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా విడుదల తేదీపై కసరత్తులు జరుగుతుండగానే, ప్రమోషన్ల విషయంలో మాత్రం చిత్ర యూనిట్ పక్క స్కెచ్ రెడీ చేస్తోంది. అందులో బాగంగానే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఈ నెలలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ ద్వారానే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. నాని మార్కు ఎమోషన్స్ మరియు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విడుదల తేదీ మరియు ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version