NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

Nani

Nani

Saripodhaa Sanivaaram : న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది “హాయ్ నాన్న ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది .ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో నాని ,మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి.. అనే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ సారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Read Also :Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే

ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా  షూటింగ్ జ‌రుపుకుంటోంది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ మూవీని ఆగ‌స్టు 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా ఫ‌స్ట్ సింగల్ ను రిలీజ్ చేసింది. ‘గ‌రం గ‌రం యముడ‌యో’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ పాట విశాల్ ద‌ద్లానీ పాడగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.