Site icon NTV Telugu

The Paradise: నాని సినిమాలో హాలీవుడ్ నటుడు.. ఇంతకీ ఎవరతను..?

Nani The Paradise

Nani The Paradise

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం “ది ప్యారడైజ్” ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. “దసరా” బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డెట్ వచ్చింది.

READ MORE: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె

‘ది ప్యారడైజ్‌’ ఇంటర్‌నేషనల్ స్థాయిలో రూపొందుతోంది. భారత్‌లోని అనేక భాషలతో పాటు, ఇంగ్లీష్, స్పానిష్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ అంతర్జాతీయ చిత్రానికి ప్రాధాన్యత కల్పించేందుకు టీం సరికొత్త ప్లాన్ వేసింది. ఈ చిత్రంలో ఓ హాలీవుడ్ నటుడిని చేర్చాలని చూస్తోంది. ‘ది ప్యారడైజ్‌’లో ర్యాన్‌ రేనాల్డ్స్‌ ఎంట్రీపై ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ నటుడు ర్యాన్‌ రేనాల్డ్స్‌ని సంప్రదించినట్టు సమాచారం. ‘డెడ్‌పూల్’, ‘ఫ్రీ గయ్’ వంటి సినిమాల్లో నటించిన హాలీవుడ్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్‌కి ఇండియాలో మంచి ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. అతను నటించిన ‘డెడ్‌పూల్ & ఊల్వరైన్’ మూవీ ఇండియాలో కూడా అదిరిపోయే వసూళ్లు సాధించింది.

READ MORE: Karimnagar: వామ్మో వడ్ల దొంగలు.. ఐకేపీ సెంటర్ వద్ద ఆరబెట్టి ధాన్యం చోరీకి యత్నం..

Exit mobile version