Site icon NTV Telugu

The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?

Nani The Paradise

Nani The Paradise

దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిగా మార్చేసి ‘జడల్’ (Jadal) అనే రగ్గడ్ క్యారెక్టర్ కోసం కండలు పెంచి సిద్ధమయ్యారు. నిజానికి ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉండగా, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని చిత్రబృందం దీనిని ఆగస్టు 21, 2026కి వాయిదా వేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ డెడ్‌లైన్ కూడా రీచ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోందని టాక్. ఎందుకంటే ఇంకా 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావడం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెండింగ్‌లో ఉండటం ఇందుకు ప్రధాన కారణం.

మరోవైపు, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ చేతిలో ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ది ప్యారడైజ్’ వంటి ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కీలకం కానుంది. అనిరుధ్ తన సినిమాల అవుట్‌పుట్ విషయంలో చాలా సమయం తీసుకుంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆగస్టు నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే, సినిమాను డిసెంబర్ 2026కి వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ రూ. 150 కోట్ల బడ్జెట్ చిత్రం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఒకవేళ ఆగస్టు మిస్ అయితే, క్రిస్మస్ రేసులో ‘ది ప్యారడైజ్’ నిలిచే అవకాశం ఉంది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version