Site icon NTV Telugu

The Paradise : నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీ అప్‌డేట్..

Nani's 'The Paradise

Nani's 'The Paradise

‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). అనౌన్స్‌మెంట్ నుండే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుండి ఆగస్టు 21, 2026కి మారింది. రిలీజ్ వాయిదా పడిందని నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక కిక్కిచ్చే అప్‌డేట్ అందించింది.

ఈ సినిమాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ సాంగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించిన ఈ పవర్‌ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అనిరుధ్ మార్క్ ఎనర్జీతో రాబోతున్న ఈ పాట బాక్సాఫీస్ వద్ద బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరీ ముఖ్యంగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. సోనాలి కుల్కర్ణి, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Exit mobile version