Site icon NTV Telugu

Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!

Nani

Nani

Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా బజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ డ్రామా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ మరో అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని ‘జడల్’ పాత్రలో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు.

READ ALSO: AP Liquor Sales: న్యూ ఇయర్‌ కిక్కు.. ఏపీలో రికార్డు లిక్కర్ అమ్మకాలు!

ఇప్పటి వరకు నాని చేసిన సినిమాల పాత్రల కన్నా పూర్తిగా భిన్నంగా ఉన్న క్యారెక్టర్ ప్యారడైజ్ సినిమాలో చేస్తున్న జడల్ పాత్ర. ఈ క్యారెక్టర్ కోసం నాని ఇప్పటి వరకు తనకు ఉన్న ప్రత్యేక లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, పూర్తి స్థాయి ఊర మాస్ లుక్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. ఈ సినిమాలో ఫారిన్ ఫైటర్స్‌తో జరిగే మేజర్ యాక్షన్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందని సమాచారం. ఆ ఫైట్‌కి సంబంధించిన మాస్ లుక్‌లో, రా అండ్ రస్టిక్ లుక్‌లో ఉన్న నాని కొత్త పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. నిజానికి నేచురల్ స్టార్ నానికి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అలాంటి లవర్ బాయ్‌ను ఇంతటి మాస్ లుక్, ఊర మాస్ క్యారెక్టర్‌లో లేడీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ సినిమాను 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు ‘జడల్’.. స్టార్ మ్యూజిషియన్ అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకులలో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది. రఘవ్ జుయల్, సోనాలీ కులకర్ణి, కయాడు లోహర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో మైలురాయి కాబోతోందని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ఈ ‘జడల్ జమానా’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో.. చూడాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

READ ALSO: Maruthi: ‘రాజాసాబ్‌’ ఫ్లాప్‌ కావాలని కొందరు తెగ తాపత్రయపడుతున్నారు: మారుతి షాకింగ్ కామెంట్స్

Exit mobile version