న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ.. మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. దసరా, హాయ్ నాన్న సక్సెస్‌లతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు..
ఈసారి ఏకంగా తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నట్టుగా, కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. నాని ఎప్పుడు కొత్త ప్రయోగాలను చేస్తుంటాడు.. కొత్త దర్శకులకు ఛాన్స్ లను కూడా ఇస్తుంటాడు.. శ్రీకాంత్ ఓదెలతో దసరా చేసి దర్శకుడిగా అతడ్ని నిలబెట్టాడు. మళ్లీ రెండో సినిమా కూడా ఇచ్చాడు.. ఇప్పటికే తమిళంలో వెప్పం అనే సినిమా చేశాడు.. పెద్దగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత కూడా సినిమాలు చేశాడు.. అవి పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు తమిళంలోనూ క్రేజ్ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..
ఈ తమిళ దర్శకుడు జై భీమ్ మూవీ మంచి సక్సెస్ ను అందుకున్నాడు.. ఆ సినిమా తర్వాత రజినీతో వేట్టయాన్ అనే మూవీని తీస్తున్నాడు. ఈ చిత్రం తరువాత నానితో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడట.. అతని కథ నచ్చడంతో ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఇక శ్రీకాంత్ ఓదెలతో, వేణు సినిమాలను పక్కన పెట్టి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడా? లేక ఆ సినిమాలు అయ్యాక దీన్ని అనౌన్స్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది..
