NTV Telugu Site icon

Nani : కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాని..?

Whatsapp Image 2023 07 11 At 4.35.57 Pm

Whatsapp Image 2023 07 11 At 4.35.57 Pm

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమా తో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించడం జరిగింది.పాన్ ఇండియా స్థాయి లో సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా సుమారు 100 కోట్ల కు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.నాని కెరీర్ లోనే దసరా సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వెంటనే నాని మరో సినిమాను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా నాని కెరీర్ లోనే 30 వ సినిమా గా తెరకెక్కుతుంది.

ఈ సినిమా ను కొత్త దర్శకుడు అయిన శౌర్యన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒక ముఖ్య పాత్ర లో కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది..ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా లో నాని పాత్ర పూర్తి గా విభిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 21న క్రిస్మస్ కానుక గా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చెరుకూరి మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు… ఇదిలా ఉండగా నాని తరువాత సినిమా పై ఒక వార్త బాగా వైరల్ గా మారింది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో నాని తన తరువాత సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ కోలీవుడ్ డైరెక్టర్ ఎవరంటే శివ కార్తికేయన్ తో డాన్ వంటి ఎమోషనల్ సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సిబి చక్రవర్తి తో నాని తన తరువాత సినిమా చేయనున్నాడని సమాచారం.మరీ ఈ కాంబో గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Show comments