NTV Telugu Site icon

Hi Nanna : మరో అరుదైన ఘనత సాధించిన నాని సినిమా..

Whatsapp Image 2024 05 06 At 6.52.32 Am

Whatsapp Image 2024 05 06 At 6.52.32 Am

గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.”హాయ్ నాన్న” సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ప్లస్ అయ్యాయి. వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించింది.థియేటర్స్ లో మంచి విజయం సాధించిన హాయ్ నాన్న  రూ.76కోట్ల వసూళ్లను సాధించి అదరగొట్టింది.

థియేటర్స్ లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఏడాది జనవరిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.. ఓటీటీలో కూడా హాయ్ నాన్న మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. భారీ వ్యూస్ సాధించి అదరగొట్టింది .ఇదిలా ఉంటే ఈ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది .హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై వరుస అవార్డులు లభించాయి. తాజాగా ఈ విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించింది.స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍ 2024లో హాయ్ నాన్న సినిమా ఏకంగా ఆరు అవార్డులు గెలుచుకుంది. ఈ స్వీడెష్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ కు మూడు అవార్డులు , డైరెక్టర్ శౌర్యువ్‍కు రెండు అవార్డులు , నాని – మృణాల్‍ జోడికి ఓ అవార్డు దక్కింది.హాయ్ నాన్న సినిమాకు అవార్డులు రావడం పట్ల మేకర్స్ ఎంతో సంతోషంగా వున్నారు. “ప్రేమ, ప్రశంసలతో సినిమా సెలెబ్రేషన్ జరుగుతోంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాయ్ నాన్నసినిమా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ప్రేమకు అసలైన ప్రతిధ్వని ఇది. 18 ఇంటర్నేషనల్ అవార్డులు.. కౌటింగ్” అని వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.