టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. ఇటీవల ఆయన నటించిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి… ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం ‘హాయ్ నాన్న’ని తీసుకు వస్తున్నారు.. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు..
ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు. ఇందులో భాగంగా ఒక అభిమాని.. ‘కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. దానికి నాని బదులిస్తూ.. ‘బలగం వేణు’ అని బదులిచ్చారు.. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది..జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల తన రెండో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాను అని చెప్పాడు..
నాని సినిమాల విషయానికొస్తే.. హాయ్ నాన్న సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది.. ఆ తర్వాత ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. నాని 31వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ వచ్చింది. ఈసారి ఒక మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు..
Venu (Balagam)#AskNani #HiNanna https://t.co/mQYllIZKEm
— Hi Nani (@NameisNani) December 4, 2023