Site icon NTV Telugu

Nani – Srikanth odela : పూజా కార్యక్రమాలతో నాని-ఓదెల రెండో ప్రాజెక్ట్ షురూ

New Project 2024 10 13t074115.185

New Project 2024 10 13t074115.185

Nani – Srikanth odela : గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో నాని. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కూడా ‘దసరా’ తరహాలో సింగరేణి నేపథ్య కథ అని ప్రచారం జరిగింది.

Read Also:Utsavam: ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటున్న ఉత్సవం

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో సాగే కథాంశంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు దసరా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాను గ్రాండ్ గా ప్రకటించడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఆ వీడియో రిలీజ్ చేయకుండానే, సినిమా ఓపెనింగ్ జరిగింది. దసరా సందర్భంగా ఈరోజు నాని – శ్రీకాంత్ ఓదెల కొత్త సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Read Also:Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

దేవుడి చిత్రపటాలపై నాని క్లాప్ తో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ప్రస్తుతానికి పూజ జరిగిందని, మిగతా వివరాలను తర్వాత ప్రకటిస్తామన్నారు. బహుశా.. అనౌన్స్ మెంట్ వీడియో ఇంకా రెడీ అవ్వలేదేమో. గత నెల 18న వీడియో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాపై ఇప్పటికే చాలా విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారని, మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే అవేవీ నమ్మొద్దంటూ నిర్మాత సుధాకర్ ఏకంగా ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం.

Exit mobile version