Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కర్నూలు బస్సు దగ్ధం తరహాలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. శిరివెళ్ళ మెట్ట సమీపంలోని నేషనల్ హైవేపై టీవీ ఎస్ 50 ఎక్సెల్ ను శ్రీవారి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టింది.. హైదరాబాద్ నుంచి తిరుచ్చికి 18 మందితో ప్రయాణిస్తున్న శ్రీవారి ట్రావెల్స్ బస్సు.. టీవీఎస్‌ను ఒక్కసారిగా ఢీకొంది. ఢీకొట్టిన తర్వాత బస్సు కింద ఇరుక్కుపోయింది టీవీఎస్ 50.. బస్సు ఆ బైక్‌ను వంద మీటర్లు ఈడ్చుకెళ్లింది. పెద్ద శబ్ధం రావడంతో బస్సు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టూవీలర్‌పై ఉన్న నక్కలదిన్నె నాగయ్య (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి చెన్నయ్య(30)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మర్గంమధ్యలో మృతి చెందాడు. బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.. బస్సును ఆపకుంటే కర్నూలు బస్సు దగ్ధం ఘటన రిపీట్ అయ్యే ప్రమాదం ఉండేది. సీఐ దస్తగిరి బాబు, ఎస్సై పీరయ్య సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
READ MORE: Ind vs SA: ఫలించని తిలక్ వర్మ ఒంటరి పోరాటం.. దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తు..!
