Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తులూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమల ట్రావెల్స్, మహేశ్వరి ట్రావెల్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. అయితే.. బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరూ తృటిలో ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఓవర్టేక్ చేయబోయి ప్రమాదం
లభ్యమైన సమాచారం ప్రకారం.. అమల ట్రావెల్స్ బస్సు 20 మంది ప్రయాణికులతో పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. అదే సమయంలో, 27 మంది ప్రయాణికులతో బద్వేల్ నుంచి హైదరాబాద్ మార్గంలో పయనిస్తున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సును అమలా ట్రావెల్స్ బస్సు ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వేగ నియంత్రణ కోల్పోయి అమల ట్రావెల్స్ బస్సు మహేశ్వరి ట్రావెల్స్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Also Read
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
ధ్వంసమైన వాహనాలు
ఢీకొన్న తీవ్రతకు అమల ట్రావెల్స్ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ముందు భాగంలో కూర్చున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ముందు వెళ్తున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. ఏ ఒక్కరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పోలీసుల దర్యాప్తు
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆళ్లగడ్డ స్థానిక పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా రహదారిపై నిలిచిపోయిన బస్సులను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా డ్రైవర్ నిద్రమత్తా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!