Nandikotkur MLA Arthur: నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నన్ను తప్పించి మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానం ఇష్టమన్న ఎమ్మెల్యే ఆర్థర్.. గతంలో కూడా వేరే వాళ్ళను తప్పించి తనకు టికెట్ ఇచ్చారని వెల్లడించారు. నందికొట్కూరు టికెట్ వద్దన్నానని, ఎమ్మెల్యే పదవి నాకు, అధికారాలు వేరేవాళ్లకు అంటేనే టికెట్ వద్దన్నానని ఆర్థర్ వెల్లడించారు.
Read Also: Gidugu Rudraraju: ఎల్లుండి పీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు.. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!
కార్యకర్తలు ఇండిపెండెంట్‌గా పోటీ చేయమంటున్నారని, అందరితో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిద్దామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. 21న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశానని.. ఆ రోజు నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో సర్వేలో 70 శాతం తనకు అనుకూలంగా వచ్చిందని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు.