Site icon NTV Telugu

Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

Venkyanil5 Movie Updates, Kalyan Ram And Krithi Shetty

Venkyanil5 Movie Updates, Kalyan Ram And Krithi Shetty

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ద్వయం, ఇప్పుడు మరో విభిన్నమైన సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నందమూరి కల్యాణ్ రామ్ ఒక పవర్‌ఫుల్ సర్ప్రైజింగ్ రోల్ పోషిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా అనిల్ రావిపూడి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు.

‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (లైక్)’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో.. తన మూవీలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా ‘కృతి… సీ యూ సూన్ ఆన్ సెట్స్’ అని చెప్పకనే చెప్పేశాడు అనిల్ రావిపూడి. ఈ క్రేజీ పెయిర్ ఈ సినిమాలో జతకట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఈ సినిమాలో ఎమోషన్ యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ వంటి సీనియర్ స్టార్‌తో కల్యాణ్ రామ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగ లాంటి వార్త అనే చెప్పాలి. ఇక కృతి శెట్టికి కూడా ఈ భారీ ప్రాజెక్ట్ కెరీర్‌లో ఒక మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version