Balakrishna: బాలయ్య ఆ దర్శకుడికి ‘నో’ చెప్పాడా?

Balakrishna

Balakrishna

Balakrishna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గత 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకి ఎనలేని సేవలను అందిస్తున్న బాలయ్య, ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని టాలీవుడ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్ స్టార్టింగ్‌లోనే డిఫరెంట్ సినిమాలు చేసిన ఆయన, గత కొద్ది సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాల మీదనే ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘దాదా’ మూవీ చేస్తున్నాడు. డాన్‌గా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్‌కి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం బాలయ్య కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఆయన చేసిన కొన్ని సినిమాల కంటెంట్ విషయంలో లోపాలు జరగడంతో, సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేదు. సినిమాలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నా కథ లేకపోతే ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడం కష్టమవుతుంది. అందుకే కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

ఒకప్పుడు బాలయ్యకి వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేసిన ‘సింహ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి బాలయ్య వెనుతిరిగి చూడకుండా వరుస విజయాలను అందుకుంటున్నాడు. గత ఏడాది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అఖండ 2’ మూవీ బాలయ్య అభిమానులను నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు కంటెంట్ మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. తాను ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో ఆదరణ దక్కుతుందనే విషయంలో తన కూతురు తేజస్విని సలహాలను తీసుకొని స్టోరీస్‌ను ఫైనల్ చేస్తున్నారు. నిజానికి తేజస్విని స్క్రిప్ట్ పనులను చూస్తున్నప్పటి నుంచే బాలయ్య వరుసగా నాలుగు విజయాలను అందుకున్నాడు.
వివేక్ ఆత్రేయ సినిమా అందుకే ఆగిపోయిందా?

‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలను సరికొత్త స్క్రీన్‌ప్లేతో ప్రెజెంట్ చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ, వరుసగా ‘అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో విజయాలను సాధించాడు. వివేక్ ఆత్రేయ గతంలో బాలయ్యకి ఒక కథను వినిపించాడు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొట్టాయి. కానీ ఫైనల్‌గా బాలయ్య కథలో కొన్ని చేంజెస్ అడగడం, వివేక్ ఆ కీలకమైన మార్పులు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ ప్రాజెక్టు హోల్డ్‌లో పడిపోయింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ రవితేజతో ‘తులాభారం’ మూవీ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎలాగైనా బాలయ్యతో సినిమా చేస్తానని వివేక్ పలు సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేయడం విశేషం.