NTV Telugu Site icon

Namratha Shirodkar :ఐదు పదుల వయసులో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో నమ్రత..

Namratha

Namratha

తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి యావత్ సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు, పిల్లల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత అందం చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, ప్యాంట్స్ ధరించి కిరాక్ పోజుల్లో సరికొత్తగా దర్శనమిచ్చారు. నమ్రత అందంలో కాలేజ్ గర్ల్ తో పోటీపడుతున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

నమ్రత ఇంత యంగ్ గా కనిపించడానికి కారణం క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. నమ్రత దినచర్యలో వ్యాయామం భాగంగా ఉంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా జిమ్ కి వెళతారు. ఆహార నియమాలు పాటిస్తారు. అన్నింటికీ మించి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. అదే ఆమె బ్యూటీ సీక్రెట్… ముంబయి లో ఒక స్టార్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్ద వారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఎప్పుడూ కనిపిస్తారు..

మహేష్ తో జీవితం పంచుకున్న నమ్రత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.. వారి బాగోగులను చూసుకుంటూ మహేష్ బాబు సినిమాల విషయాలను చూసుకుంటున్నారు.. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు..మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం.. ఎప్పుడూ సమయం దొరికినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు.. ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Show comments