Site icon NTV Telugu

Akkineni Nagarjuna: రేపు కోర్టుకు హాజరు కానున్న హీరో నాగార్జున

New Project (79)

New Project (79)

Akkineni Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాగ్ పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. రేపు అంటే మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది. దీంతో రేపు కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Read Also:Malla Reddy and Teegala Krishna Reddy: త్వరలో టీడీపీ గూటికి తీగల.. మరి మల్లారెడ్డి..?

ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా.. హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున, సమంతతో పాటు సినీ రంగ ప్రముఖులంతా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించినందుకు చింతిస్తున్నట్లు కొండా సురేఖ ప్రకటించినప్పటికీ.. ఆమె వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Read Also:Thummala Nageswara Rao: రూ. 2 లక్షల పైబడి రుణం.. మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

Exit mobile version