Site icon NTV Telugu

Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా..

Chethas

Chethas

Namibian Cheetah: కునో నేషనల్ పార్కులో చీతా పిల్లలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమంలో షేర్‌ చేశారు. అయితే, కొత్తగా పుట్టిన చీతా కూనలకు సంబంధించిన ఓ వీడియోని కూడా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్‌ చేశారు. తల్లి పొత్తిళ్లలో అవి ఆడుకుంటూ కనబడుతున్నాయి. అయితే, 20 రోజుల క్రితం (జనవరి 3న) నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆశా అనే చీతా కూడా మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

Read Also: Fighter: 166 నిమిషాల స్టన్నింగ్ ఏరియల్ యాక్షన్…

ఇక, 2023 మార్చిలో జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో ఉంది. ఇక, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరుకుంది. కాగా, కునో నేషనల్‌ పార్క్‌లో చీతాలు ఒకటి తర్వాత మరొకటి వరుసగా మరణిస్తున్నాయి. గత మంగళవారం (జనవరి 16న) శౌర్య అనే చీతా చనిపోయింది. దీంతో నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి ఇప్పటి వరకు వరుసగా 10 చీతాలు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 7 పెద్ద చీతాలు కాగా, మూడు కూనలు ఉన్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్‌కు ఈ చీతాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వదిలి పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో ఈ చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం స్టార్ట్ అయింది.

Exit mobile version