NTV Telugu Site icon

T20 World Cup : తొలిపోరులోనే శ్రీలంకపై నమీబియా ఘన విజయం

Namibia Vs Srilanka

Namibia Vs Srilanka

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసే టీ20 వరల్డ్‌ కప్‌ రానేవచ్చింది. నేటి నుంచి వరల్డ్‌ కప్‌ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. అయితే.. తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు నమీబియా జట్టుతో తలపడనుంది. అయితే.. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకున్న‌ది. మొత్తం 16 టీమ్‌లు టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే.. ఆదివారం నుంచి తొలి రౌండ్ అర్హ‌త మ్యాచ్‌లు జ‌రుగ‌తున్నాయి. సూప‌ర్ 12లో చోటు కోసం మొత్తం ఎనిమిది టీమ్‌లు త‌ల‌ప‌డ‌నుండగా.. ఇందులో గ్రూప్-ఏ లో భాగంగా నేడు న‌మీబియాను శ్రీలంక‌ ఢీ కొట్టనుంది. నేడు జ‌రుగ‌నున్న మ‌రో మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్‌తో యూఏఈ పోటీ పడనుంది. గ్రూప్‌-బీలో వెస్టిండీస్‌, జింబాబ్వే, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ జట్టు ఉన్నాయి.

అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టు 20 ఓవర్లల్లో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అయితే.. నమీబియా ఆటగాళ్ల మొదట్లో తడబడడంతో.. వరుసగా ఓపెనర్లు పెవిలియన్‌ చేరారు. అయితే.. తరువాత వచ్చిన జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లో 44 పరుగులు సాధించగా.. జొనాథన్ స్మిత్ 16 బంతుల్లో 31 పరుగులు సాధించారు. చివరి 5 ఓవర్లలో నమీబియా ఆటగాళ్లు శ్రమించి 63 పరుగులు సాధించడంతో.. 7 వికెట్లు కొల్పోయి 163 పరుగులు సాధించారు. అయితే.. అనంతరం 164 లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు ఆదినుంచి టైం కాలిసిరాలేదు. దీంతో.. నమీబియా బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లు పెవిలియన్‌ బాటపట్టారు. పాథుమ్ నిస్సాంక(9), కుశాల్ మెండిస్ (6), ధనంజయ డిసిల్వా (12), ధనుష్క గుణతిలక (0), భానుక రాజపక్స(20), కెప్టెన్ దసున్‌ షనక (29), వనిందు హసరంగ (4), చమిక కరుణరత్నె(5), ప్రమోద్ మధుషన్ (0), దుష్మంత చమీర (8) పరుగులకే అంకితమయ్యారు. దీంతో కేవలం 108 పరుగులకే శ్రీలంక జట్టు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో.. 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది.