Site icon NTV Telugu

Teacher: మహారాష్ట్రలో కారు ప్రమాదం.. నల్గొండ టీచర్ సజీవ దహనం

Teacher

Teacher

అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈసారి కారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉమ్నాబాద్‌ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. నల్గొండ జిల్లా గొల్లగూడకు చెందిన టీచర్ సురేష్ కారులోనే సజీవ దహనమయ్యాడు. షిర్డి వెళ్ళి తిరిగి వస్తుండగా ఉమ్నాబాద్ వద్ద కారు అగ్ని ప్రమాదానికి గురైంది. టీచర్ సురేష్ కారులోనే సజీవ దహనం కాగా, మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

Exit mobile version