Nalgonda: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు. తమ ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలు తమకు చదువు నేర్పే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కానీ కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. అలాంటి ఓ కీచక గురువు.. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
READ MORE: Boycott Asia Cup 2025: ‘బాయ్‌కాట్’ క్యాంపెయిన్.. వెనక్కి తగ్గిన బీసీసీఐ పెద్దలు!
పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ జిల్లా పరిషత్ స్కూల్‌లో జరిగింది. ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీను తనను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. మూడు నెలలుగా వేధిస్తున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో తల్లిదండ్రులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి విద్యార్థిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడి వేధింపుల విషయం చెప్పింది. ఉదయం ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లిన పేరెంట్స్ ఘర్షణకు దిగారు. నిందితుడిని చితకబాదిన బాదారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
READ MORE: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితపై ఘాటు విమర్శలు గుప్పించిన ఆర్కే రోజా
