నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు పాలు అయ్యాడు.. తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకు వెళ్ళక తప్పదు సీఎం కేసీఆర్ కు ఆది మినహాయింపు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు. మునుగోడలో నన్ను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారు.. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరం
తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీజేపీనీ అధికారంలో కూర్చోబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు రెడీ అవుతున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకికు బీ-టీంగా ఉంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు విపక్షంలోనే కూర్చోబోతున్నాయని తరుణ్ చుగ్ కామెంట్స్ చేశాడు.
Read Also: Manasa Varanasi: మహేష్ మేనల్లుడి కోసం మిస్ ఇండియా
తెలంగాణలో బీజేపీ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.. సీఎం కేసీఆర్ బీసీ, దళితులను మోసం చేశాడని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ నేతలు కలిసికట్టుగా పోరాడితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయొచ్చని ఆయన వ్యాఖ్యనించారు. మరి కొన్ని రోజుల్లోనే కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితం కానున్నాడని తరుణ్ చుగ్ పేర్కొన్నాడు.