NTV Telugu Site icon

Nalgonda Collector: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం!

Nalgonda Collector

Nalgonda Collector

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. అనధికారికంగా విధులకు గైహాజరైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా డీఈఓతో సహా ఎవరు విధులలో లేరు. ప్రభుత్వం బుధవారం సెలవును ప్రకటించనప్పటికీ.. సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయ్యారు. దాంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నవారు లంచ్ కోసం ఇన్ని గంటలు వెలుతారా? అని మండిపడ్డారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: KTR: ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు.. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం!

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ.. ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది గైర్హాజరు కావడం బాధాకరమని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడ జరిగినా ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి పని తీరుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments