NTV Telugu Site icon

Andhra Pradesh Crime: యువతులతో నగ్న పూజలు.. బంధించి అత్యాచారం..!

Crime

Crime

Andhra Pradesh Crime: ఓవైపు టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్నా.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. ఇలా చేస్తే.. ఏదో జరిగిపోతుంది అంటూ నమ్మబలికి అందినకాడికి దండుకునే కంత్రీగాళ్లు ఓవైపు.. అదే అదునుగా చేసుకుని ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లు మరోవైపు చెలరేగుతూనే ఉన్నాయి.. పూజలతో అద్భుతాలు జరుగుతాయి.. భారీగా డబ్బు వస్తుందంటూ ఓ తాంత్రికుడు యువతులకు ఎరవేసి.. వారితో నగ్నంగా పూజలు చేయించి.. ఆ సమయంలో వారిపై అత్యాచారం కూడా చేసిన ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది..

Read Also: Ammaku Prema Kammani Vanta : అమ్మకు ప్రేమతో కమ్మనివంటలో మాధవిలత చెప్పిన సీక్రెట్స్‌

క్షుద్ర పూజలు నేపథ్యంలో ముగ్గురు యువతులపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పూజల ద్వారా అద్భుతాలు జరుగుతాయని, భారీగా డబ్బు వస్తుందని ముగ్గురు యువతులతో నగ్న పూజలు చేయించాడు ఓ నకిలీ పూజారి.. ఈ ఘటనలో ఓ నకిలీ పూజారితో పాటు పొన్నెకల్లుకు చెందిన ఓ మహిళ కీలక సూత్రధారిగా భావిస్తున్నారు పోలీసులు.. పూజల పేరుతో నమ్మబలికి వారిని ట్రాప్‌ చేయడమే కాదు.. యువతులను బంధించి గుంటూరు, విజయవాడ, ఒంగోలులోని లాడ్జిల్లో నగ్నంగా పూజలు చేసినట్లు సమాచారం.. ఇక, పూజలు చేస్తున్న సమయంలోనే యువతులపై అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.. ఆ యువతులంతా కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.. పూజలన్నీ నకిలీవని తేలడంతో దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు యువతులు.. దీంతో, రంగంలోకి దిగి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు నల్లపాడు పోలీసులు.